జయప్రకాశ్ ఆత్మ గోషిస్తోంది
పాట్నా,సెప్టెంబర్1(జనంసాక్షి):
అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నేత జయప్రకాశ్ నారాయణ్ మృతికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి నితీష్ కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని ధ్వజ మెత్తారు.జేపీ ఆత్మ ఘోషిస్తోందని మోది ఎద్దేవ చేశారు. బీహార్‌ను బాగుచేయాలంటే బిజెపికి మాత్రమే సాధ్యమని అన్నారు. సోమవారం ఆయన భాగల్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల పరివర్తన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అలాగే ప్రతిపక్ష కూటమిపై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సిద్దాంతాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఒక్కటయ్యాయన్నారు. జేడీయూ, కాంగ్రెస్ కూటమిలోని నాయ కులు జయప్రకాశ్ నారాయణ్, లోహియాల సిద్దాంతాలకు అతీతంగా మారార న్నారు. ఓటర్లు ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు బీహార ్‌లో కుల, మత, రాజకీయాలను ప్రోత్సహించాయని దుయ్యబట్టారు. తిరిగి 25 ఏళ్ల తర్వాత బీహార్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేద్దామని భావిస్తున్నారని పేర్కొన్నారు. బీహారీలకు గుండా రాజ్‌ల నుంచి విముక్తి కలగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన అనేది ఉండాలన్నారు. బిజెపి మాత్రమే ఈ అంతరాలను తొల గించి సమర్థమైన పాలన సాధించి పెట్టగలదన్నారు. బీహార్‌లో అభివృద్ది చూడాలని కోరుకుంటున్నానని ప్రధాని అన్నారు. బిహార్ ఓటర్లు అభివృద్ధి చేయగల సత్తా ఉన్న పార్టీకే ఓటెయ్యడానికి నిశ్చయించుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే ఐదేళ్లూ తాము పారదర్శకంగా బిహార్ అభివృద్ధికి కృషి చేస్తామని హావిూ ఇచ్చారు. 2019లో తాను మళ్లీ బిహార్ వచ్చి తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి రికార్డులన్నింటినీ ప్రజల ముందుంచుతానన్నారు.
ఇచ్చిన హావిూలు నెరవేర్చండి: నితీశ్
తమ ప్రజలకు మోదీ కొత్త హావిూలేవిూ ఇవ్వనవసరం లేదని ఇప్పటి వరకు ఇచ్చిన హావిూల్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తే చాలని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అన్నారు. నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లో పరివర్తన్ ర్యాలీలో నరేంద్ర మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై నితీశ్ తన ట్విట్టర్లో స్పందించారు. ఇప్పటివరకు ఇచ్చిన హావిూల్ని నెరవేర్చి బిహార్‌కు నైతిక ద్ఘిర్యాన్ని ఇస్తే చాలని అంతకు మించి కొత్త హావిూల్ని ఇవ్వవద్దని అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు భాజపా సీట్లు కేటాయించకూడదన్నారు.