జహీరాబాద్ పోలీసులకు మజ్లిస్ పార్టీ ఫిర్యాదు

జహీరాబాద్ ఆగస్టు 20 (జనంసాక్షి) మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ భారత్ నగర్ తంగడ్ పల్లిలో కొందరు అగంతకులు రాత్రి చీకటిలో మజ్లిస్ వార్డు కార్యాలయం జెండా పైపును పగలగొట్టి పోస్టర్‌ను చింపివేశారు. సమాచారం అందుకున్న మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షులు పార్టీ నాయకులతో కలిసి భారత్ నగర్ తంగడ్ పల్లిని సందర్శించారు. అక్కడి నుంచి జహీరాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎ ఎస్ ఐ నర్సింలు కున్ పిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు భరత్‌ నగర్‌ తంగడ్ పల్లి వార్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, విచారణ చేసి వారిని అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం జహీరాబాద్‌ మజ్లిస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అత్తర్‌ అహ్మద్‌ మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు ఆదరణ లభిస్తుందనే భయంతోనే వార్డు కార్యాలయంపై దాడి చేశారు వారి పిరికితనానికి నిదర్శనం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక రాత్రి చీకటిలో ఈ పిరికిపంద పని చేశారు. దుర్మార్గులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ సంయుక్త కార్యదర్శులు అమెర్ బిన్ అబ్దుల్లా, మహ్మద్ షోయబ్, షేక్ ఇలియాజ్ కోశాధికారి మహ్మద్ తసఫూర్ భారత్ నగర్ అబ్దుల్ నబీ, వివిధ వార్డుల అధ్యక్షులు మహ్మద్ అయూబ్, సయ్యద్ రాషెద్, మహ్మద్ ముజీబ్, మహ్మద్ యూనుస్ పార్టీ నాయకులు మహ్మద్ షరీఫ్, షేక్ ఘౌస్, మహ్మద్ షఫీ, సమీర్, అమెర్, ఆసిఫ్, షఫీ, జావీద్, ఇస్మాయిల్‌ అజీమ్ తదితరులు పాల్గొన్నారు