జాతీయ సమైక్యత పెంపొందించటకై పోస్టల్ సిబ్బంది బైక్ ర్యాలీ.

తొర్రూర్ ,ఆగస్టు  (జనంసాక్షి)   డివిజన్ కేంద్రంలో ఆజాద్ కి  హింద్ మహోత్సవం లో  భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ను నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ పోస్టల్ సిబ్బందిచే స్థానిక తపాల కార్యాలయం నుండి  గాంధీ సెంటర్ బస్టాండ్ సెంటర్ మీదుగా మన గ్రోమోర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జాతీయ సమైక్యత పెంపొందించాలి నినాదాలు చేస్తూ  వజ్రోత్సవాల ను విజయవంతం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ ని  చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ఆఫీస్స్ లావూరి సైదా మాట్లాడుతూ మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు ప్రతి ఇంటిపై మన జాతీయ పతాకం మువ్వన్నెల జెండా ఎగర వెయ్యాలని కోరారు. తద్వారా ప్రతి పౌరులు జాతీయ భావం మరియు దేశ సమైక్యత పెంపొందించడం కోసం ఈ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు మరింత చేరువలో ఉండుట గాను కేంద్ర ప్రభుత్వం అన్ని పోస్ట్ ఆఫీస్ లలో జాతీయ పతాకాన్ని విక్రయిస్తున్నామని తెలిపారు. కేవలం 25 రూపాయలకే లభిస్తుందని దీనిని మీరు స్థానిక పోస్ట్ చేసినందుకు లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే మా పోస్టల్ బట్వాడా  సిబ్బంది ద్వారా మీ ఇంటికి చేరవేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ సబ్ పోస్ట్ మాస్టర్ నాగమల్ల కృష్ణమూర్తి, కళానిత్ వినీష్, నరేష్ ,సుధీర్ ,మధు ,సతీష్ యాకయ్య  తెలంగాణ సామాజిక  రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు ఇమ్మడి రాంబాబు  షాట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి , శివ,సబ్ డివిజన్ పరిధిలోని పెద్ద వంగర, వడ్డే కొత్తపెళ్లి ,కొడకండ్ల, దంతాలపల్లి సబ్ పోస్ట్మాస్టర్  బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.