జాతీయ స్థాయిలో రాణించిన సోహైల్ కి సన్మానం

సారంగపూర్ ( జనంసాక్షి ) 23 అక్టోబర్

సారంగపూర్ మండల్ లచక్కపెట్ గ్రామానికి చెందిన మహమ్మద్ కైసర్ గారి కుమారుడు మహమ్మద్ సోహైల్ తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఐదు కిలోమీటర్ల వాకింగ్ పోటీలో ప్రథమ స్తానం పొందిన సందర్భంగా ఈ రోజు మహమ్మద్ సోహైల్ గారికి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శాలువా తో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సారంగపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ,సోహైల్ జాతీయ స్థాయి లో రాణించి కుటుంబాన్ని కి మరియు గ్రామానికి మంచి పేరు తేవాలి అని తెలిపారు.జాతీయ స్థాయి పోటీలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువ మోర్చా అధ్యక్షుడు దీటి వెంకటేష్,సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ భూమ్ రెడ్డి గారు, యువ నాయకులు లెక్కల సందీప్, మండల ఓబీసీ మోర్చా కార్యదర్శి ధార శ్రీనివాస్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అక్తర్, మొహమ్మద్ నవాబ్ మరియు స్థానిక యువత పాల్గొన్నారు.