జిఎం కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: జిఎం
పినపాక నియోజకవర్గం ఆగస్టు 27 (జనం సాక్షి):మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన బీ వేంకటేశ్వర రెడ్డి శనివారం మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ భవన సముదాయంలోని వివిధ విభాగాలను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ జి ఎం కార్యాలయం ఏరియా లోని అన్ని గనుల విభాగాలకు గుండెకాయ లాంటిది, బిల్లుల చెల్లింపులో అక్కౌంట్స్ విభాగము సిబ్బంది, ఉద్యోగుల వేతనాలు , టెర్మినల్ టెనిఫిట్స్ చెల్లింపులో పర్సనల్ విభాగ సిబ్బంది, వివిధ రకాల కాంట్రాక్ట్స్ ఇవ్వడంలో పర్చేస్ విభాగం, మొక్కల సంరక్షణ ప్రాధాన్యతలో పర్యావరణ విభాగము, సివిల్ విభాగము, ఈ&ఎం విభాగము, ఎస్టేట్ విభాగము, సెక్యూరిటీ విభాగములన్నీ సమన్వయంతో పని చేయడము వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత సాధించుటలో ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. సంబంధిత సిబ్బంది తమ దగ్గరికి వచ్చు ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు తగు రీతిలో సమాధానాలు చెపుతూ తమకు కేటాయించిన పనులను బాధ్యతతో ఎప్పటికప్పుడు పూర్తి చేయవలసిందిగా సూచనలు చేశారు.వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు తమ విభాగాలకు చెందిన ఉద్యోగులను జిఎం జి వేంకటేశ్వర రెడ్డి పరిచయం చేయడం జరిగింది. అలాగే అన్ని విభాగాలకు సదుపాయాలను , ఫర్నీచర్ లను సమకూర్చేల ఏర్పాట్లను చేస్తామని జనరల్ మేనేజర్ తెలిపారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ను సకాలంలో అందేలా పనులు చేయాలని పర్సనల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కు సూచించారు.
ఈ పరిచయ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి లలిత్ కుమార్ , ఆయా విభాగాల ఉన్నతాధికారులు పిఏ టు జిఎం రాంబాబు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.