జిల్లాలో ప్రవేశించిన సీపీఎం జీపుజాత
అల్లంపూర్: ఫిబ్రవరి 24న ప్రారంభమైన అఖిల భారత సంఘర్ష్ సందేష్ జీపుజాత నాలుగు రాష్ట్రాల మీదుగా నేడు
మహబూబ్‌నగర్ జిల్లా అల్లంపూర్ చౌరస్తాకు చేరుకుంది. ఈ జీపుజాతాలో పాల్గొన్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు
రామచంద్రన్ పిళ్లే, వరద రాజన్, సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు బేబి. శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యురాలు సుధా సుందర రామన్, కేంద్ర కమిటీ సభ్యుడు గపూర్‌లకు మంగళవారం సీపీఎం జిల్లా కార్యదర్శి కిల్లే గోపాల్ రాష్ట్ర నాయకుడు జాన్ వెస్లీ, డివిజన్ నాయకుడు వెంకటస్వామి, అల్లంపూర్ శాఖ నాయకులు రాజు, దాసు , ఆటో కార్మికులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపుతుందని అన్నారు.