జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి
*తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
మిర్యాలగూడ, జనం సాక్షి.
తెలంగాణ రైతు సంఘం నల్గొండ జిల్లా కార్యవర్గాన్ని గురువారం మిర్యాలగూడ జరిగిన మహాసభలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు (మిర్యాలగూడ) కార్యదర్శిగా కూన్ రెడ్డి నాగిరెడ్డి (హాలియ) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోశాధికారిగా బండ శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా ముది రెడ్డి సుధాకర్ రెడ్డి, కందల ప్రమీల, అశోక్ రెడ్డి, పి.రాంరెడ్డి, సహాయ కార్యదర్శులుగా వెంకట రమణ రెడ్డి, కత్తి శ్రీనివాస్ రెడ్డి, ఐతరాజు నర్సింహ, చేలగాని మల్లయ్య, రాగిరెడ్డి మంగా రెడ్డి, ముత్తిలింగం తో పాటు 37 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.