జిల్లా లో స్టెమ్ ల్యాబ్ గ్రంథాలయాలు

జిల్లా విద్యాశాఖ – సమగ్ర శిక్ష , సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో  హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎంపిక కాబడిన 90 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో స్టెమ్ ( సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్ట్స్) ల్యాబ్ లు, స్మార్ట్ క్లాస్ రూమ్ లో గ్రంథాలయాలు ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలను  చేపట్టుతున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం పిఎన్ఎం ఉన్నత పాఠశాల కూకట్ పల్లి లో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి ఐ విజయ కుమారి  ఆధ్వర్యంలో నిర్వాహకులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్.డి.ఎఫ్.సి.సౌత్ రిజినల్ హెడ్ విశాల్ భాటియా , సేవ్ ది చిల్డ్రన్ సంస్థ సౌత్ హబ్ ప్రతినిధులు , ప్రశాంతి బత్తిన , నగేష్ మల్లాది  , సుధీర్  పాల్గొని కార్యక్రమం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విద్యార్థుల్లో ఈ స్మార్ట్ క్లాసెస్ స్టెమ్ ల్యాబ్ గ్రంథాలయాల నెలకొల్పడం ద్వారా విద్యాశాఖ తోడ్పాటుతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను అభ్యసన సామర్ధ్యాలను ఏ విధంగా పెంపొందించవచ్చు అని వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా తమ వంతు కృషి చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారికి , సేవ్ ది చిల్డ్రన్, హెచ్.డి.ఎఫ్.సి ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది.