జూలూరుపాడులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు, ఆగష్టు 15, జనంసాక్షి: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మండలంలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. మండల కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. జూలూరుపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాపకొల్లు క్రాస్ రోడ్డు, చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆటో యూనియన్ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిజెపి పార్టీల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్సై గణేష్, పోలీస్ సిబ్బంది, తహశీల్దార్ లూధర్ విల్సన్, రెవిన్యూ సిబ్బంది, ఎంపీడీవో తాళ్లూరి రవి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, పోస్టాఫీస్ ఎస్ పిఎం కళ్యాణ్, ఎంపీవో రామారావు, ఎంఈవో వెంకట్, ట్రాన్స్ కో ఇంజనీర్ రఘురామయ్య, ఐకెపి ఎపిఎం సత్యనారాయణ రాజు, ఈజీఎస్ ఏపీవో సుహాసిని, ఎఫ్ఆర్వో ప్రసాదరావు, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి పద్మజ, ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంజిబాబు, వైద్యాధికారి శ్రీధర్, పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఎంపిపి లావుడ్యా సోని, జడ్పీటీసీ కళావతి, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపిటిసిలు పొన్నెకంటి సతీష్ కుమార్, పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరి మధుసూదనరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు, యదళ్లపల్లి వీరభద్రం, నర్వనేని పుల్లారావు, రామిశెట్టి రాంబాబు, వేల్పుల నరసింహారావు, నున్న రంగారావు, మోదుగు రామకృష్ణ, చాపలమడుగు రామ్మూర్తి, రామిశెట్టి నాగేశ్వరరావు, పోతురాజు నాగరాజు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, జిల్లా నేత చండ్ర నరేంద్ర కుమార్, స్వరాజ్యరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్, గార్లపాటి వెంకటి, పవన్, అభిమిత్ర, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్, బిజెపి రాష్ట్ర నేత చిలుకూరి రమేష్, మండల అధ్యక్షులు ప్రసాద్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చండ్రుగొండ రింగ్ రోడ్ అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ కొలిపాక చంద్రశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పెండ్యాల ప్ర‌సాదరావు, పట్టణ అధ్యక్షులు ఉడతా పూర్ణచంద్రరావు, మండల మాజీ అధ్యక్షులు మహంకాళి గోపాలకృష్ణ హాజరయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మోదుగు ప్రభాకర్, సంగం నాగరాజు, బుడేన్, జస్వంత్, సిద్దిఖ్, షఫీ, సిహెచ్, గోపి,హాతీరాం, రత్న, శంకర్, యూసుఫ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.