జూలై 25 నుంచి సమ్మెకు వెళ్తాం తాహసీల్దార్ కు సమ్మె నోటిస్ ఇచ్చిన వీఆర్ఏలు

కోడేరు (జనం సాక్షి) జూలై 15 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రం లో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజు తహసీల్దార్ కు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల జేఏసీ కమిటీ పిలుపు మేరకు మండలంలోని వివిధ గ్రామాల వీఆర్ఏలు సొంత గ్రామానికి చెందిన నిధులు తప్ప ఆఫీస్ లల్లొ  విధులు నిర్వహించబోమని సమ్మె నోటీసు ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల జెఎపి  పిలుపు మేరకు గ్రామానికి సంబంధించిన విధులు మాత్రమే నిర్వహిస్తామని తాహసీల్దార్ కార్యాలయంలో ఆఫీసు డ్యూటీలు, డిఆర్ఓ మరియు కలెక్టర్ కార్యాలయంలో అటెండర్, నైట్ వాచ్మెన్లు ఆఫీసులకు సంబంధించిన విధులు నిర్వహించ బోమని వీఆర్ఏలు ఈ నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా  పే స్కేలు జీఓ విడుదల చేయాలని,అర్హత కలిగిన వారికి పదోన్నతులు వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు  వెంటనే  జీవోను విడుదల చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు 20, 21, 22 ,తేదీలలో కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు జూలై 23న కలెక్టరేట్ ముట్టడి నుండి సమ్మెకు వెళుతున్నామని వీఆర్ఏ జేఎసి తెలియజేశారు. (1) ముఖ్యమంత్రి ప్రకటించిన పే స్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలి. (2) అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలి. (3) 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. రిటైర్డ్ వీఆర్ఏలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో   విఆర్ఎ ల జేఎసి నాయకులు యండి జిలానీ వివిధ గ్రామాల విఆర్ఎ లు పాల్గొన్నారు.