జెండా ఆవిష్కరణ వేడుకలో చిన్నారులు
వేములవాడ, ఆగస్టు-15 (జనం సాక్షి) : 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహించిన జెండా ఆవిష్కరణలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంలో సైతం చిన్నారులు జెండాలు చేత పట్టుకొని దేశభక్తి నినాదాలు చేస్తూ పాఠశాలలతో పాటుగా వీధులలో ఆడుతూ పాడుతూ సందడి చేశారు