జై భీమ్ విద్య ఫౌండేషన్  ఉమెన్స్ ఐకాన్ అవార్డు 2022 ప్రముఖ మహిళా ఉద్యోగులకు ఉత్తమ పురస్కారం………

ఉత్తమ పురస్కారానికి ఎన్నికైన నల్లగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల రజిత……
వెంకటాపూర్(రామప్ప)మార్చి06(జనం సాక్షి):-
ములుగు జిల్లా  వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల రజిత జై భీమ్ విద్య ఫౌండేషన్  ఉమెన్స్ ఐకాన్ అవార్డు 2022 ఎన్నిక కావడం గ్రామ ప్రజలకు  హర్షింపదగ్గ విషయం. హనుమకొండ జిల్లా కాజీపేట లో జరిగిన జై భీమ్ విద్య ఫౌండేషన్  ఉమెన్స్ ఐకాన్ అవార్డు 2022 అవార్డ్ తీసుకోవడం జరిగింది.గ్రామ అభివృధి పనులతో గ్రామ పంచాయతీ జిల్లా లో ఆదర్శం గా నిలుస్తుంది అని చెప్పడానికి ఇదొక అద్భుతమైన నిదర్శం గా చెప్పవచ్చు.జై భీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఐకాన్ అవార్డు 2022 ప్రముఖ మహిళా ఉద్యోగులకు ఉత్తమ పురస్కారం చేయడం జరిగింది.నల్లగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల రజిత కు అత్యుత్తమ పురస్కారం ఆకునూరి మురళి మరియు మాక్స్ కేర్ హాస్పిటల్ చేర్మేన్ మరియు లా కాలేజ్ రిజిస్టర్ ల చేతుల మీదుగా సన్మానం పొందడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల రజిత మాట్లాడు జై భీమ్ విద్య ఫౌండేషన్ ఉమెన్స్ డే 2022కు ఎన్నికై అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషం గా వుంది.ముందు గా మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.జై భీమ్ విద్య ఫౌండేషన్ ఉమెన్స్ ఐకాన్ అవార్డ్ 2022 ఫౌండర్ మరియు చైర్మన్ జన్ను రాజు కు వారి సంస్థ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి మరియు మండల అధికారులు, జిల్లా అధికారుల ప్రోత్సాహం తో ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.మహిళ లు ఇంటికే పరిమితం కాకుండా ఉన్నతమైన స్థాయి లో వుండటం చాలా గౌరవ కారణమని చెప్పవచ్చు.మహిళ లు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ లాంటి పెద్ద హోదా లో వుండటం చాలా సంతోషం అని అన్నారు.