జోగులాంబ ఆలయ ఉద్యోగుల సంఘం

 అధ్యక్షులుగా రంగనాథ్ అలంపూర్ జులై 14 (జనంసాక్షి )
 అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఉద్యోగస్తుల  సంఘం ఎన్నికలు గురువారం నిర్వహించారు. సంఘం అధ్యక్షులుగా రంగనాథ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ప్రధాన కార్యదర్శి గా ప్రదీప్
 ఉపాధ్యక్షులు ఆనంద్ శర్మ, కె.శ్రీనివాసులు,
 కోశాధికారిగా  కె.ఆర్.బి.బ్రహ్మేశ్వర ఆచారి,
 జాయింట్ సెక్రేటరిగా ఎం.లక్ష్మీ నారాయణ,
 సహాయకార్యదర్శిగా   కె.గోపి, సంయుక్త కార్యదర్శి గా  మల్లేశ్వరమ్మ,
 కార్యవర్గ సభ్యులుగా
 ఎన్.ధనుంజయ శర్మ,
 ఆర్.రాఘవేంద్రరావు
 బి.రాంబాబు,
 జె.ఉమామహేశ్వరి,
 గౌరవ సలహాదారులుగా  కె.చంద్రయ్య ఆచారి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడుగా ఎన్నికైన రంగనాథ్ మాట్లాడుతూ అలంపూర్ ఆలయాల్లో పనిచేసే ఉధ్యోగులు ఐఖ్యమత్యానికి మారుపేరుగా నిలిచారన్నారు. అధ్యక్షులుగా ఎన్నికైన తను  ఉధ్యోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఆలయ ఇఓ పురంధర్ కుమార్ మరియు దేవస్థానం ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ  ఆలయ ఉధ్యోగుల సంఘ ఆర్థికపుష్టి కోసం రూ.20వేలు ఇచ్చి సంఘ ఐఖ్యతకు బలాన్ని చేకూర్చారన్నారు.  ఈఓ పురంధర్ కుమార్ మాట్లాడుతూ ఆలయ ఉధ్యోగులు దేవస్థానం అభివృద్ది కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని డ్యూటీ సమయంలో ఆలయం బయట కనిపించరాదన్నారు. జోగుళాంబ ఆలయం రాష్ట్రంలోనే ఎంతో పెద్దదని ఈ ఆలయంపై  ప్రతీ ఒక్కరి దృష్టి ఉంటుంది కనుక విధి నిర్వాహనలో ఉధ్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు.