జోరువానలో గొత్తికోయలకు వైద్యసేవలు

చండ్రుగొండ ..వర్షాకాలంలో వచ్చే సీజనల్  విష జ్వరాల నియంత్రణలో భాగంగా  బుధవారం స్థానిక  వైద్యాధికారి  వెంకట ప్రకాశ్ సిబ్బందితో కలిసి  బెండాలపాడు అటవీ సమీపంలోని  గొత్తికోయల  గుడిసెల వద్దకు వెళ్లారు. ఎడతెరిపిలేని వర్షాలతో  ద్విచక్ర వాహనం మాత్రమే వెళ్లగలిగే  మార్గం కాస్త  బురదమయంగా మారడంతో  అటవీ ప్రాంతంలో  సుమారు 2 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి  వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.  పరిసరాల్లో  చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.జలుబు దగ్గు ఉన్నవారికి సంబంధిత మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మాస్కూల పట్ల అవగాహన కలిగిస్తూ  ఇంటింటికి ఫీవర్ సర్వే  నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో  హెల్త్ సూపర్వైజర్  ఇమామ్,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్,రాజేశ్వరి , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.