టాన్జరిన్ యాప్ లో విద్యార్థికి పరీక్ష.
మండల నోడల్ ఆఫీసర్ మంగ్య,
ఖానాపురం సెప్టెంబర్ 15జనం సాక్షి
మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లకు,కాంప్లెక్స్ రిసోర్సు పర్సన్స్ లకు,కాంప్లెక్స్ సీఆర్పీ లకు తొలిమెట్టు పై మండల నోడల్ ఆఫీసర్ మంగ్య ప్రత్యేక శిక్షణ సమావేశం ను గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు క్లస్టర్ లోని ప్రతి పాఠశాల ను నెల కు ఒక సారి అన్ని పాఠశాలలు ను సందర్శించి విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలన్నారు. విద్యార్థుల ప్రగతిని టాన్జరిన్ యాప్ లో పరిశీలించి ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలని తెలిపారు. కాంప్లెక్స్ రిసోర్సు పర్సన్ లు వారి క్లస్టర్ పరిధిలోని పాఠశాలలు ను నోడల్ అధికారి తో సమీప పాఠశాలల కు వెళ్లి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ను యాప్ ద్వారా పరిశీలించాలన్నారు. అందరి సమష్టి సహకారం తో విద్యార్థుల కు చడవడం, రాయడంనేర్పించాలన్నారు.తొలిమెట్ టు కార్యక్రమం ను విజయవంతం చేయాలని తెలిపారు. సీఆర్పీ లు అందరూ వారి క్లస్టర్ పరిధిలోని పాఠశాలల ను నోడల్ అధికారి తో సందర్శించినప్పుడు టాన్జేరిన్ యాప్ లోస్పాట్ అసెస్మెంట్ లో ఆ పాఠశాల విద్యార్థి వివరాలను నమోదు చేసి తెలుగు,ఇంగ్లీష్, గణితం, పై విద్యార్థి ని పరీక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎం దూలం రాజేందర్ మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమంలో రిసోర్సు పర్సన్స్ కీలకం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ,కాంప్లెక్స్ రిసోర్సు పర్సన్ లు ,సీఆర్పీ లు ఎం.ఆర్.సి సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area