టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేవిూలేదు
– ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టినా మార్పు రావటం లేదు
– కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుండి పాలన సాగిస్తూ రాష్టాన్న్రి అధోగతి పాలు చేస్తున్నాడు
– టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ
జగిత్యాల, జులై13(జనం సాక్షి) : ప్రచార ఆర్బాటమే తప్ప తెరాస ప్రభుత్వం ప్రజలకు చేసిందేవిూలేదు అని తెలుగుదేశం అద్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. శుక్రవారం ఆయన జగిత్యాల విూడియా సమావేశంలో మాట్లాడుతూ… అనుభవం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వలన కోర్టుల్లో కేసులు నమోదవుతున్నాయి యన్నారు. కోర్టులు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టనప్పటికీ ప్రభుత్వంలో మార్పురాకపోడం సోచనీయమన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి ఋణగ్రస్త తెలంగాణాగా మారుస్తున్నాడని విమర్శించాడు. ప్రచార ఆర్బాటమే తప్ప తెరాస ప్రభుత్వం ప్రజలకు చేసిందేవిూలేదు అని రమణ ఆరోపించారు. 28 రాష్టాల్ర ముఖ్యమంత్రులు సచివాలయం నుండి పాలన సాగిస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ నుండి పాలన సాగిస్తూ రాష్టాన్న్రి అదోగతి పాలుచేస్తున్నాడని రమణ తెలిపారు. తెలంగాణా ఏర్పాటుకు మూల కారణమైన నిదులు, విదులు, నియామకాలు ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందని రమణ అన్నారు. బీసీల పక్షాన టీడీపీ పోరాడుతుందని అన్నారు.