టీజీటీల వృత్యంతర శిక్షణ
మునగాల, ఆగష్టు 30(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలోని మునగాల ఆదర్శ పాఠశాలనందు సూర్యాపేట జిల్లాలోని 9 ఆదర్శ పాఠశాలలలో పనిచేస్తున్న గణిత మరియు హిందీ పిజిటి మరియు టీజీటీల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సూర్యాపేట జిల్లా ఆదర్శ పాఠశాలల నోడల్ ప్రిన్సిపల్, స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సాయిఈశ్వరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ప్రస్తుత తరుణంలో విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వృత్యాంతర శిక్షణాలు ఎంతో అవసరమని, ప్రస్తుత విద్యా విధానంలో శాస్త్ర సాంకేతిక రంగాలను అనుసంధానం చేస్తున్నందున ఉపాధ్యాయులు కూడా దానికి అనుగుణంగా తమ యొక్క బోధన నైపుణ్యాలను మలుచుకోవాలని సూచించారు. వారి సందర్భంగా శిక్షణ తరగతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల పిఆర్టియు అధ్యక్షులు కాసాని నాగేశ్వరావు, శిక్షణ ఉపాధ్యాయులుగా బి ప్రసాద్, గోపాలరావు, పిరుసాయిబ్, లక్ష్మీనారాయణ, అంబేద్కర్, ప్రసన్న, మేడం తదితరులు పాల్గొన్నారు.