టూవీలర్ పార్కింగ్ స్టాండ్ ను ప్రారంభించిన ఎసిపి
ఫోటో రైటప్, 17 బీడీఎన్, టూ వీలర్ పార్కింగ్ స్టాండ్ ను ప్రారంభిస్తున్న ఎసిపి రామారావ్
బోధన్, ఆగస్టు 17 ( జనంసాక్షి ) : బోధన్ ఆర్టీసీ డిపో బస్టాండు వద్ద బుధవారం ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యదునిక సౌకర్యాలు కలిగిన టూ వీలర్ పార్కింగ్ స్టాండ్ ను ఎసిపి రామారావ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ, టూ వీలర్ పార్కింగ్ సౌకర్యాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రాయాణికులను కోరారు. డీయం మాట్లాడుతూ, ప్రయాణికులు టూ వీలర్ పార్కింగ్ స్టాండ్ లో పార్కింగ్ చేసి తమ వాహనాలకు సెక్యూరిటీని కల్పించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ డీపో మేనేజర్ టీయన్ స్వామి, బోధన్ పట్టణ సీఐ ప్రేమ్ కుమార్, తదిదరులు పాల్గోన్నారు.