ట్రాక్టర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

రాజన్న సిరిసిల్ల,జూన్‌4(జ‌నం సాక్షి ): కొనరావుపేట్‌ మండలం నిజామాబాద్‌ గ్రామంలో విషాదం నెలకొంది. మలకపేట రిజర్వాయర్‌ కట్టపై ట్రాక్టర్‌తో నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అనిల్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడిని ఆస్త్రికి తరలించబోగా అప్పటికే చనిపోయాడని గుర్తించారు. దీంతో అనిల్‌ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.