ఠాణా సమీపంలో తెలంగాణవాదుల భైఠాయింపు
గోదావరిఖని, జులై 22 (జనంసాక్షి) : టీబీజీకేఎస్, టీఆర్‌ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తు ఆదివారం స్థానిక వన్‌టౌన్ పోలీ స్‌స్టేషన్ సమీపంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తెలంగాణవాదులు భైఠా యించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యను వెంటనే విడుదల చేయాలని ఆ సంఘ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ నినాదాలను చేస్తు పోలీస్‌స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై కూర్చున్నారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ విజయమ్మ దీక్షను విచ్చిన్నం చేస్తారనే ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని, సీమాంధ్ర నాయకత్వానికి పోలీసులు కొమ్ముకాస్తు న్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదన్నారు. ఈ ఆందోళన సుమారు గంటపాటు కొనసాగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు గద్ద కుమారస్వామి, ప్యారేమి యా, అర్జున్, దామోదర్, రాజమౌళి, శ్యాంసన్, సత్యనారాయణరెడ్డి, శ్రీను, దండె రవి, ఉల్లంగుల రమేష్, దాసరి వెంకటి, సాంబయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.