డివికె అన్న సంస్మరణ సభ*
కమ్మర్పల్లి 06.జులై (జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని నల్లూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కమ్మర్పల్లి ప్రజా పంథా సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివికె అన్న సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి సబ్ డివిజన్ కార్యదర్శి సారా సురేష్ మాట్లాడుతూ డివికె అన్న ఒక పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి,ఉద్యోగo చేస్తున్న సమయంలో 1970 సంవత్సరం లో విప్లవ రాజకీయల వైపు ఆకర్షితులై విప్లవకారుడిగా పని చేయడం జరిగిందని అన్నారు.అంతేకాకుండ అతివాద,మితవాద రాజకీయలను సరిచేయడానికి అనేక అవమానాలను ఎదుర్కొన్నారు అని గుర్తు చేశారు.తను నమ్ముకున్న సిద్ధంతాన్ని నిర్మాణ పద్ధతుల్లో చేయడానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. అలాంటి మహోన్నత మైన వ్యక్తి కమ్యూనిస్టు అగ్రనేత మరణం మనకు తిరనిలోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజపంథా నాయకులు సత్తెక్క ,అశోక్ ,కిసాన్ బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.