డెలివరీ బాయ్ స్క్యాం మోసాలలో చిక్కు కోకండి

– సీఐ సీతయ్య

మక్తల్, జూలై 17( జనం సాక్షి)

మనం ఎలాంటి ఆర్డర్స్ చేయకుండానే మనకు ఏదో ఒక వస్తువు వచ్చినట్లు, నేను డెలివరీ బాయ్ అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటారు కొందరు మోసపూరితమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల యొక్క ఫోన్ రిసీవ్ చేసుకుని వారు అడిగే ఓటీపీ నెంబర్ ఎవరు కూడా చెప్పవద్దని డెలివరీ బాయ్ స్క్యామ్ మోసాలకు ఎవరు కూడా మోసపోవద్దని సీఐ సీతయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం మక్తల్ లో విలేకరులతో మాట్లాడుతూ మనము ఎలాంటి వస్తువులను ఆర్డర్ చేయకున్నప్పటికీ మీకు ఆన్లైన్ ద్వారా వస్తువు పార్సల్ వచ్చిందని డెలివరీ బాయ్ ఫోన్ చేస్తుంటారని సిఐ సీతయ్య తెలిపారు. అలాంటి వారి నుండి ఈ విధమైన ఫోన్ లు వచ్చినా అది తప్పకుండా మిమ్ములను మోసం చేసే శ్క్యాం అయ్యి ఉంటుందని సిఐ తెలిపారు. మనం రిప్లై ఇస్తూ నేను ఎలాంటి ఆర్డరు పెట్టలేదు నా వస్తువు కాదు అని మనము చెప్పగానే అలాగైతే వాటిని క్యాన్సల్ చేస్తాను మీకు ఓటిపి వస్తుంది వెంటనే చెప్పండి అని డెలివరి బాయ్స్ మోసపూరితమైన వంటి మాటలను నమ్మి ఎవరు కూడా ఓటీపీ నెంబర్ చెప్పవద్దని సీఐ సీతయ్య తెలియజేశారు. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటూ మీ ఫోన్ నెంబర్లు కానీ ఓటీపీ నెంబర్ కానీ చెప్పిన వెంటనే మీ అకౌంట్ లో ఉన్నా డబ్బులన్నీ కాళీ అవ్వక తప్పదని సీఐ సీతయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. అలాంటి ఫోన్ లకు ఎవరు కూడా మోసపోవద్దని, అలాంటి ఫోన్ లు ఏవరైనా వస్తే పోలీసు సిబ్బందికి వెంటనే తెలియ చేయాలన్నారు. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని సీఐ సీతయ్య ఈ సందర్భంగా తెలియజేశారు.