ఢల్లీి అత్యాచార సంఘటనలు, నిరసనలు
(శనివారం తరువాయి భాగం)
అప్పటి ఉద్యమం నడిచినప్పుడు చట్టాల పనితీరు కొంత మారినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటిదాకా అత్యాచార చట్టాల పనితీరు అత్యంత బాధాకరంగా కొనసాగుతుంది.పొలీసులు,కోర్టులు ఇప్పటికీ అత్యాచారాల బాధితులను హీనంగానే చూస్తున్నారు.డిఫెన్సు న్యాయవాదులు బాధితులను అబద్దాల కోరులుగాను,వేశ్యలుగాను లేదా వేరే కారణాలతో అత్యాచార ఫిర్యాదు చేశారని నిరుపించాడానికి ప్రయత్నిస్తున్నారు.వైద్య పరీక్షలు బాధిత స్త్రీల గాయాల గురించి కాక,వారి ఇటవ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేస్తారు.
1970 స్త్రీల ఉద్యమాలు కొత్త చట్టాల కోసం అడిగితే ,ఢల్లీి సంఘటన తరువాత వచ్చిన నిరసనలు ఆయా చట్టాలను పని చేయించమని డిమాండ్ చేశాయి.ఆయా చట్టాలను పని చేయకుండా ఆపుతున్న పరిపాలన వ్యవస్థల వైఫల్యాలని ఎత్తి చూపాయి. పనిచేసే చట్టాలు ,పోలీసు వ్యవస్థ కావాలని అడుగుతున్నాయి.జరిగిన హింస చెప్పుకొలేనివిగా భావించిన పరిస్థిదతులు 1970 నాటివైతే,తాము స్త్రీలమవడం వల్లే తమ పై హింసను గుర్తించట్లేదు అని ‘సమాన పౌరసత్వాన్ని ’ అడుగుతున్నాయి ఈనిరసనలు.
అప్పుడు కొత్త చట్టాల కోసం అడిగితే,ఇప్పటి యువ ఉద్యమకారులు కొత్తపాలనా సంసృతిని అడుగుతున్నారు.
1970 నాటి స్త్రీవాదం శీలం, స్త్రీత్వం,పితృస్వామ్యం స్త్రీల పై మోపె బారమని,వాటి ప్రాధాన్యతని కుటుంబాలు,సమాజం,రాజ్యం పోషిస్తాయని,దానాలో భాగంగానే స్త్రీలపై దాడులను కప్పిపెడతాయని చెపుతూ,అటువంటి స్త్రీతత్వ భారాన్నుండి స్త్రీలు విడుదల కావాలని వాదించింది.2012లోనిరసనలు చేసిన యువతరకరకాల కారాణాల వాళ్ల ఇటువంటి భావజాల భారాన్నుండి కొంత మేరకు విడుదలయినవారు.దానికి స్త్రీల ఉద్యమం కొంత కారణమయితే,ప్రభుత్వం చేపట్టిన‘స్త్రీల సాధికారత’ నినాదాలు,కార్యక్రమాలు కూడా కొంత మేరకు కారణమని చెప్పుకోవచ్చు.1990ల తరువాత ప్రభుత్వాలు స్త్రీవాదాన్ని పరిపాలన సంస్కృతిలో భాగం చేసుకోనే క్రమంలో స్త్రీల సాధికారత నినాదాన్ని బాగా ప్రచారం చేశాయి.‘స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి’అన్న నినాదం, పాలనా రంగంలో స్త్రీలను బాగస్వాములను చేసుకొనే ప్రయత్నాలు స్రీలకి తాము కూడా ప్రభుత్వ పాలనలో భాగమే అన్న భావనను నయానా భయానా కల్పించింది.
ఢల్లీి ప్రభావిత నిరసనలని స్త్రీ వాద ఉద్యమాలు(పాతవయినా కొత్తవయినా)నుండి వేరు చేసే ఇంకోక ప్రధాన తేడా`న్యాయం గురించిన అవగాహన.2013 కొత్త పాలనా సంస్కృతిని అడుగుతున్న వారిలో వివిధ నేపథ్యాల నుండి వచ్చినవారున్నారు.వారిలో గ్రామిణా ప్రాంతాల నుండివలస వచ్చి పట్టణాలల్లో తమ అడ పిల్లల్నిచదివిస్తున్నవారున్నారు. కరుడుగట్టిన అధికారదాహం,పాలనా వైఫల్యాలు, మధ్యతరగతి పట్టణ ప్రజల విషయాల పట్ల రాజకీయ నిర్లిప్తతను వ్యతిరేకించిన హజరే నిరసనల ద్వారా వీధుల్లోకి వచ్చిన మద్యతరగతివాఇరున్నారు.అయితే వీరిలో అనేక మందిఅత్యాచారాలు ఆపాలంటే సత్వర న్యాయం కావాలని,సత్వర న్యాయం అంటే త్వరగా కఠిన శిక్షలు పడాలనే నమ్మకాలతోఉన్నారు.నిరసనల్లో నేరుగా పాల్గోనని అబ్బాయిలు,అమ్మాయిలు కూడా ఇంటర్నేట్‌లో అభిప్రాయాలు పంచుకున్నారు.హైదారాబాద్‌లోరాజకీయ పార్టీల నుండి, ముస్లిం స్త్రీల సంఘాల వరకు ఇటువంటి నినాదాలతోనే అనేక నిరసనల్లో పాల్గోన్నారు.
మరయితే ఢల్లీి ప్రభావిత నిరసనల ప్రాముఖ్యతేమిటి?
పట్టణాల్లో రోడ్లపై, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిర్భయ వంటి స్త్రీలపై అపరిచతులు జరిపే దాడుల పట్ల వ్యక్తమయిన ఈ నిరసన, స్త్రీలపై వ్యవస్థీకృత హింస పట్ల, రాజ్య హింస పట్ల, కుల, మత పరమయిన హింస పట్ల ఎందుకు వ్యక్తం కాలేదనే ప్రశ్న, నాతో సహా అనేకమంది రాజకీయ కార్యకర్తలని భాధించింది. అయితే ఢల్లీి ప్రభావంతో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు, యువ పౌరులు తమ కోసం తాము చేపట్టినా, సార్వజనీన రాజ్యంగ విలువలు, పాలనా సంస్కృతిని మార్చడానికి సహకరించేవే. ప్రపంచీకరణ తరువాత మధ్య తరగతి యువత తమ కోసం తామే బతికే వారుగా తయారయ్యారు. వారికి సమూహాల అవసరం, సామూహిక ప్రయత్నాల ప్రధాన్యత అభిప్రాయాలని ఈ నిరసనలు కొంతయినా మార్చాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో చిన్న, పెద్ద ఉద్యోగాల్లో చేరిన స్త్రీలందరూ లింగ వివక్ష లేదనో, తాము వివక్షకు గురికావడం లేదనో, గురవుతున్నామని చెప్పుకోవడం తమ వ్యక్తిత్వంపై మచ్చగానో అనుకోవడం మామూలయిపోయింది. పట్టణాల్లో మధ్యతరగతి స్త్రీలు రోజువారీ జీవితంలో ఎదురయ్యే లైంగిక వేధింపులను ఎలాగో అల తప్పించుకుంటూ ఆ అనుభవాల గురించి ఆలోచించ కుండా నేర్చుకున్నారు. ఈ నిరసనలు వారి నిర్లిప్తతను బద్దలుకొట్టి వారిని రోడ్లపైకి తీసుకొచ్చాయి. మధ్యతరగతికి చారిత్రకంగా లభించిన అధికారం, పాత్ర వల్ల, మధ్యతరగతి స్త్రీలు రోడ్లపైకి రావడం జాతీయ మీడియా, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నాయి. సామాజికంగా, రాజకీయంగా స్త్రీలు ఎదుర్కొంటున్న విపక్ష, స్త్రీ పురుష అసమానతలూ, లైంగిక హింస మళ్లీ సమాజం ముందుకు, రాజకీయ అజెండాలోకి వచ్చాయి. ఈ సందర్భం అనేక ఉద్యమాల్లో పనిచేస్తున్న స్త్రీలకూ, స్త్రీ వాదులకూ లైంగిక హింసకు సంబంధించిన చట్టాలను మార్చాలని సుదీర్ఘంగా చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పించింది. అపరిచితులు జరిపే అత్యాచారాలే కాక, సైన్యం, పోలీసు, బలగాలు, కుటుంబ సభ్యులు జరిపే దాడులను పరిగణలోనికి తీసుకోవాలనీ, స్త్రీలని, పిల్లని లైంగిక దోపికీ కోసం రవాణా చేయడాన్ని నేరపూరిత చర్యగా చేయాలనీ వాదించడానికి అవకాశం కాల్పించింది. స్త్రీలపై బయట జరిగే హింసనే కాక, బాధితులపై పోలీసు స్టేషన్లలోనూ, న్యాయస్థానాలలో విచారణ పేరుతో జరిగే హింసను చర్చించి, పోలీసు యంత్రాంగం న్యాయస్థానాల సంస్కృతిని మార్చాల్సిన అవసరాన్ని చర్చించే అవకాశాన్ని కల్పించింది. స్త్రీల భద్రత అనేది, ఒక వ్యక్తిగత విషయంగానో లేదా మానవ ప్రవృత్తికి సంబంధించిన ఆంశంగానో కాక, పరిపాలనా సంస్కృతికి సంబంధించిన ఆంశంగా ముందుకు తేవడానికి సహాయపడ్డాయి. జస్టిస్ వర్మ కిమటీ మంచి రిపోర్ట్ రాయడానికి తొడ్పడ్డాయి.
(ఇంకా వుంది)