ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన దేశానికి సిగ్గుచేటు : మేరీకామ్
దేశ రాజధాని ఢిల్లీలో 23యేళ్ల విద్యార్థినిపై సామూహిక అల్యాచారం ఘటన చోటు చేసుకోవడం దేశానికి సిగ్గుచేటని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, మణిపూర్ మహిళా బాక్సర్ మేరీ కామ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆమో మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తలు జరిపిన గ్యాంగ్‌రేపు సంఘటన మనసును కలచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనను తలచుకుంటేనే తనకు భయమేస్తుందని ఇంతటి నాగరిక సమాజంలోనూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో వైద్య విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థించాలని ఆమె కోరారు.