తల్లితండ్రులు లేరని బాధ పడవద్దు..

 జెడ్ పి చైర్పర్సన్ డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్
-అండగా ప్రభుత్వం ఉంది
-లక్ష్య సాధన దిశగా రాణించాలని పిలుపు
 హన్మకొండ బ్యూరో ఆగస్టు 19 జనం సాక్షి
బాలసదనంలో రక్షణ సంరక్షణ కోసం ఆశ్రయం పొందుచున్న పిల్లలు తల్లి తండ్రులు లేరని బాధ పడవద్దని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ అన్నారు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజున ప్రభుత్వ బాలికా సదనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ, తల్లీ తండ్రిని కోల్పోయి బాలసదనంలో ఆశ్రయం పొందుచున్న పిల్లలకు, ఆయా సంరక్షణ కేంద్రాలలో ఆశ్రయం పొందుచున్న  పిల్లల బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు,
పిల్లలు చిన్న నాటినుండే స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల చరిత్ర తెలుసుకోవాలని, జాతీయ భావం పెంపొందించుకోవాలని అన్నారు, లక్ష్య సాధన దిశగా చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.
జెడ్పి స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ పిట్టల శ్రీలత మాట్లాడుతూ
బాలసదనంలోని పిల్లల రక్షణ సంరక్షణ కోసం పని చేసే ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పని చేయడం హర్షించదగ్గ విషయమని, ఇక్కడ కుటుంబ వాతావరణం కనపడుతుందని అన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఆయా సంక్షేమ గురుకుల పాఠశాలలో మరియు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో చేర్పించామని అన్నారు
అనంతరం పిల్లలకు మిఠాయిలు పండ్లు పంపిణీ చేసారు,
డైనింగ్ హాల్ లో ఫ్యాన్ ఏర్పాటు కోసం  జెడ్పి   చైర్ పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్ నగదు ను అందించారు
బాల సదనం పిల్లల కోసం బస్ ఏర్పాటు నిమిత్తం ఆర్ టీ సీ అధికారులతో మాట్లాడి తగు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కార్య క్రమంలో  జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, సిడిపివో కు కే మధురిమ, కే శిరీష , అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కే అనితా రెడ్డి, బాల సదనం పర్యవేక్షణ అధికారి ఎం కళ్యాణి, ప్రొటెక్షన్ అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, పొక్సో పి పి ఎం రంజిత్, సీనియర్ న్యాయవాది జీ వినోద్ తదితరులు పాల్గొన్నార.