తల్లి భాష తెలుగుపై పట్టు సాధించాకే ఇతర భాషల్లోకి వెల్లాలి
కరీంనగర్,నవంబర్30(జనంసాక్షి): తల్లి భాషే అయిన తెలుగు భాషపై పట్టు సాదించి ఇతర భాషలు ఎన్నైనా నేర్చుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా జిల్లా యంత్రాంగంచే జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవధానం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు., ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆంగ్ల భాషపై మోజుతో తల్లి భాష అయిన తెలుగు మరిచిపోవద్దన్నారు. తెలుగు బాష, సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రపంచానికి తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తుందన్‌ఆనరు. తెలుగు బాషను ప్రపంచ వ్యాప్తం చేయుటకు కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు తెలుగు బాషాబిమానులు కృషి చేయాలన్నారు. తెలుగు బాషను కాపాడుకునే బాద్యత మనందరిపై ఉందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను ఇంతవరకు రాష్ట్రంలో నిర్వహించలేదన్నారు జడ్పీలో జరుగు ఉత్తర ప్రత్యుతతరాల ఫైల్లను అన్ని తెలుగులోనే నిర్వహించుటకు ఆదేశాలుజారీ చేశామన్నారు. నగర మేయర్ రవిందర్ సింగ్ మాట్లాడుతూ తెలుగు భాష అమ్మబాషని తెలుగు వారు తెలుగు బాషను మరిస్తే కన్న తల్లిని మరిచనట్టే అన్నారు. దేశంలో ఐఎఎస్‌లు అయిన వారందరు వారి ప్రాంతీయ భాషల్లో చదివిన వారేనన్నారు. మాతృభాషలో చదివితేనే అన్ని విషయాలుఅర్దం అవుతాయన్నారు. తెలుగు బాషా మాదుర్యాన్ని తియ్యదనాన్ని వారికి నేర్పించాలన్నారు భాషఫలు ఎన్నైనా నేర్చుకోవాలని తెలుగు బాషను మాత్రం మరువవద్దన్నారు. ఈసందర్బంగా మేయర్ ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా తెలుగులో ప్రసంగించడం పలువురిని ఆకట్టుకుంది. కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ మాతృబాషను తప్పకుండా నేర్చుకోవాలన్నారు మారుతున్న సమాజంలో ప్రస్తుతం అన్ని రాష్టాల్ల్రో మాతృభాషను వదిలేసి ఆంగ్లభాషను నేర్చుకుంటున్నారన్నారు. అంగ్లంలో
మాట్లాడేవారందరు గొప్పవారు కారని మాతృభాషను తప్పకుండా నేర్చుకోవాలన్నారు. కవిూషనర్ శశాంక్ మాట్లాడుతూ అమ్మభౄష అయిన తెలుగు భాష వస్తేనే అన్ని బాసలు నేర్చుకోగలుగాతమన్నారు. విద్యార్థులు ఆంగ్లంతోపాటు మాతృభాఫ అయిన తెలుగుబాషలో కూడా ప్రావీణ్యం పొందాలన్నారు. కరీంనగర్ కవులు రచయితలు చరించిన పుస్తకాలను చదువాలని తెలుగు బాషకు గొప్ప భవిష్యత్ కల్పించాలన్నారు. అనంతరం అవుసుల భాను ప్రకాశ్ ఆవధాని ఆద్వర్యంలో అష్టావదానం కకార్యక్రమం నిర్వహించారు. వృశ్చకులుగా వేణుశ్రీ(సమస్య), నంది శ్రీనివాస్(ఆశువు), మర్రిపెల్లి శ్రీనివాస్(దత్తపది) గాజుల రవిందర్ (ఆప్రస్తుత ప్రసంగం), విఠల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొని తెలుగు బాష సంస్కృతి సాంప్రదాయాలు తోలుగు బాష గోప్పదనం గురించి కొనియాడారు.




