తహశీల్దార్లు బదిలీ
కడప, జూలై 10 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్‌ఏ ఉత్తర్వుల మేరకు పాలనాపరమైన సౌలభ్యం కోసం ఈ బదిలీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 19 మంది తహశీల్దార్లను బదిలీ చేశామని ఆయన స్పష్టం చేశారు.