*తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన వీఆర్ఏలు*

– కొనసాగుతున్న నిరవధిక సమ్మె

మునగాల, అక్టోబర్ 10(జనంసాక్షి): తమ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గత 78 రోజులుగా వీఆర్ఏలు విధులను బహిష్కరించి కుటుంబ పోషణ భారమైనా దిగమింగుకుంటూ దీక్షలు చేస్తుంటే కొందరు అధికారులు మాత్రం దీక్షలు నీరుగారేలా చేయడం శోచనీయమని వీఆర్ఏ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయాన్ని వీఆర్ఏలు ముట్టడించి వారి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల వీఆర్ఏ జేఏసి చైర్మన్ గట్టు ఉపేందర్, నరేష్, ఖాసీం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.