తాగండిరా.. తాగి ఉగండిరా…!

C

– ప్రతి 30 వేల జనాభాకు ఒక బారు

– నగరపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కొత్త బార్లు

– తెలంగాణ బార్లకు కొత్త మార్గదర్శకాల విడుదల

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి):

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త బార్‌ లైసెన్సుల మార్గదర్శకాలను  బుధవారం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం బార్‌ లకు లైసెన్సులు ఇవ్వడం కోసం గైడ్‌ లైన్స్‌ విడుదల చేసింది.కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలలో బార్‌ లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి ముప్పైవేల మందికి ఒక బార్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.గ్రేటర్‌ హైదరాబాద్‌ లో మాత్రం ప్రతి పదమూడువేల జనాభాకు ఒక బార్‌ లైసెస్స్‌ ఇస్తారు.అలాగే త్రిస్టార్‌ ¬టళ్లలో కూడా మద్యం అమ్మకాలకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. దీనివల్ల బార్‌ ల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, పురపాలికలు, నగర పంచాయతీల వారీగా లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించేలా మార్గదర్శకాలు రూపొందించింది. పురపాలికలు, నగర పంచాయతీల్లో 30వేల జనాభాకు ఒక బార్‌, 30-60వేల జనాభాకు రెండు బార్లకు అనుమతి ఇవ్వనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి 13వేల జనాభాకు ఒక బార్‌, 13-26వేల జనాభాకు రెండు బార్లకు అనుమతి ఇవ్వనున్నారు. త్రీస్టార్‌ ఆపై స్థాయి ¬టళ్లు, రెస్టారెంట్లకు ఆంక్షలు లేకుండా బార్లకు అనుమతి మంజూరు చేయనున్నారు. 2015-2016 సంవత్సరాలనికి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం బార్ల కేటాయింపునకు మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి 13 వేల జనాభాకు ఒక బార్‌, 13 నుంచి 26 వేల జనాభాకు రెండు బార్లకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. 3స్టార్‌ ఆపై స్థాయి ¬టళ్లు, రెస్టారెంట్లకు ఆంక్షలు లేకుండా బార్లకు అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పురపాలక, నగర పంచాయతీల్లో 30 వేల జనాభాకు ఒక బార్‌, 30 నుంచి 60 వేల జనాభాకు రెండు బార్లకు అనుమతినిచ్చింది. డ్రా పద్ధతిన బార్ల లైసెన్సుల కేటాయింపు జరగనుంది.