తాటిచెట్టు సౌండ్ గుట్టు తెలిసిపోయింది
జగిత్యాల,జూలై27(జనం సాక్షి ): జిల్లాలోని కొండగట్టులో ఇటీవల ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ తాటి చెట్టు నుంచి శబ్దం వినిపిస్తుందంటూ ఊర్లో ప్రచారం జరిగింది. ఇంకేముంది.. జనాలు తండోపతండాలుగా వచ్చి ఆ చెట్టు నుంచి వస్తున్న శబ్దానికి ఎల్లమ్మ తల్లి కారణమని పూజలు మొదలుపెట్టారు. పసుపుకుంకుమ చల్లుతూ… అమ్మ వారి మహిమ అంటూ కొందరు పూనకాలతో ఊగిపోయారు. కానీ, ఈ శబ్దం వెనకున్న అసలు మిస్టరీ వీడటంతో గ్రామస్తులు చలల్బడ్డారు. గ్రామంలో ఘటన గురించి తెలుసుకున్న మల్యాల సీఐ అక్కడికి వెళ్లి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ చెట్టు నుంచి వస్తున్న శబ్దానికి కారణం తేనెటీగలని తేల్చారు. అకారణంగా అన్నింటినీ నమ్మొద్దని.. నిజానిజాలు తెలుసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దీంతో ఈ సౌండ్ వెనకున్న మిస్టరీ వీడింది.