తితిదే అధికారులతో సమావేశమైన శాసనసభ కమిటీ భేటీ

హైదరాబాద్‌ : తితిదే అధికారులతో శాసనసభ అమలు కమిటీ సమావేశమైంది. 2009 లో తితిదే ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం గుత్తేదారులకు ఇచ్చిన రూ.7 కోట్ల వసూలు చేయాలని కమిటీ ఆదేశించింది. తిరుపతిలో 548 ఎకరాల తితిదే భూముల అన్యాక్రాంతంపై మరోసారి సమావేశమవుతామని కమిటీ భైర్మన్‌ పేర్కొన్నారు. శ్రీవారికి వినియోగించని ఆభరణాలు తితిదే మ్యూజియంలో ప్రదర్శిస్తామని ఈవో హామీ ఇచ్చారని కమిటీ ఛైర్మన్‌ తెలిపారు.