తుర్కపల్లిలో గ్రామ  బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు . బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో  కమిటీ చైర్మన్ గ్రామ బాలల పరిరక్షణ కమిటీ గురించి మాట్లాడుతూ.. 0 నుండి 18 సంవత్సరాల బాలబాలికల రక్షణ మరియు సంరక్షణ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, పిల్లల భద్రత అందరి బాధ్యత అన్నారు, ప్రతినెల గ్రామసభ లో బాల బాలికల మరియు మహిళల  సమస్య లను చర్చించు  కుంటామని జీడిపల్లి కవిత వేణు గోపాల్ రెడ్డి అన్నారు. గ్రామ సెక్రెటరీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల రక్షణకు, మహిళల భద్రతకు నెలలో గ్రామసభలో చర్చించు కుంటామని, బాల బాలికలపై జరుగు తున్న అఘాయితులపై, బాల్య వివాహా లకు, బడి ఈడు పిల్లలు బడిలో ఉండా లని తెలిపారు. ఇందులో భాగంగా మేడ్చల్_మల్కాజ్గిరి జిల్లా బాలల పరిరక్షణ సభ్యుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాల బాలికల కు ఎలాంటి సమస్య వచ్చినా 1098 కాల్  చేయవచ్చని ఈ ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ జాతీయస్థాయిలో పని చేస్తుందని తెలిపారు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలో గ్రామంలోని బాల్య వివాహాలు, బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, పిల్లలు బాల కార్మికులు గా పనిచేయరాదని, బిక్షాటన చేస్తున్న పిల్లలు కనిపించిన, తప్పు పోయిన పిల్లల గురించి తెలిసిన, బాలలపై జరుగుతున్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు మరియు అఘాయిత్యాలపై పిల్లల అక్రమ రవాణా దత్తత ప్రక్రియ, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు స్పాన్సషిప్ ఇవ్వడం జరుగుతుందని,  మరియు చిన్నారుల భద్రతకు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ యుసుఫ్ బాబ,అంగన్వాడి టీచర్ లు అనురాధ , విజయలక్ష్మి , సుజాత, లావణ్య, జయ, డాక్టర్ సృజన, వి.ఓ కవిత, లావణ్య ఏ.న్ ఓ , లలిత,వార్డ్ మెంబర్స్, దాసరి మమత, ఉప్పల చంద్రారెడ్డి,  గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద, పాఠశాల యాజమాన్య చైర్మన్ ఉరడి కృష్ణ, గ్రామ పోలీస్ అధికారి ఎల్లం, ఆశా.సంతోష, గ్రామ పాలక మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తాజావార్తలు