తెలంగాణపై డెడ్‌లైన్ పెట్టింది కాంగ్రేస్సే : ఈటెల
కరీంనగర్: తెలంగాణ ఇస్తామంటూ, పలానా రోజు ప్రకటన చేస్తామంటూ డెడ్‌లైన్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీయే అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు.