తెలంగాణలో కేబినెట్ భేటీపై ఈసీ షరతులు

  • ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దు: టీజీ కేబినెట్ మీటింగ్ కు ఈసీ షరతు

  • కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ
  • జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్
  • రైతు రుణమాఫీపై చర్చించవద్దని షరతు

తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. నిన్నంతా ఈసీ అనుమతి కోసం వేచి చూసిన ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులు… అనుమతి రాకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. ఈరోజు ఈసీ అనుమతి లభించడంతో కాసేపట్లో కేబినెట్ భేటీ అవుతోంది. అయితే ఈ భేటీకి ఈసీ కొన్ని షరతులు విధించింది. కేవలం జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో… విద్యా సంస్థల్లో వసతులు, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ బ్యారేజ్ తదితర ప్రధాన అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనుంది. మరోవైపు, ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది.