తెలంగాణలో కొత్తశక్తిగా భాజపా

` అందులో ఏ మాత్రం సందేహం లేదు
` పట్టణాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకే అనుకూలం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో భాజపా కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో భాజపా సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.సమ్మక్క, సారక్క యూనివర్సిటీ, పసుపుబోర్డు, టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను మోదీ తెలంగాణకు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే వీటిని మోదీ చేతుల విూదుగా ప్రారంభించబోతున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ కుటిల ప్రయత్నాలను ప్రజలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకి అనుకూలంగా ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. ముందుగానే చెప్పినట్టుగా.. ఈ ఎన్నికల్లో భాజపాకి మంచి ఫలితాలు రానున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.