తెలంగాణలో పుష్కల అవకాశాలు

C

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ఓల సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి):

కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన ప్రపంచ ఆర్థిక వేదికలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దన్నరం పోరాడమని… తమది వేర్పాటువాదం కాదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోగం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము దశాబ్దంన్నర పోరాడమని చెప్పారు. తమది వేర్పాటు వాదం కాదని, అన్నారు. ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఎట్‌ క్రాస్‌ రోడ్స్‌ అంశంపై సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర పాలన, దేశాభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రణాళిక సంఘం స్థానంలో నీతిఆయోగ్‌ టీం ఇండియాలా పనిచేస్తుందని.. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రధాని సంస్కరణల మార్గంలో పయనిస్తున్నారని… గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ గొప్ప విజయం సాధించారని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని వివరించారు. రెండు వారాల్లో అనుమతులు పొందేహక్కు పారిశ్రామిక వేత్తలకు ఉండేలా ప్రత్యేక చట్టం రూపొందించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 56 కంపెనీలకు అనుమతులిచ్చామని చెప్పారు.  15 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చాం. దేశాభ్యున్నతిపై ఆయన స్పందిస్తూ.. భారతదేశంలో రాష్టాల్రది క్రియాశీలక పాత్రని అన్నారు.  ప్రణాళిక సంఘం స్థానంలో నూతనంగా ఏర్పడిన నీతి ఆయోగ్‌ టీమిండియాలా పనిచేస్తుందన్నారు. . ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తారని అన్నారు.  అతిపెద్ద మార్కెట్‌ కలిగిన భారత్‌లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువ. భారత్‌ ఇదే విధంగా ముందుకు వెళ్తుందన్న విశ్వాసం తమకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నాటి చైనాకు ఇప్పటి చైనాకు చాలా తేడా ఉందన్నారు. చైనా అన్ని రంగాల్లో దూసుకుని పోతోందన్నారు. చైనా పర్యటన తొలిరోజు సీఎం బృందం వెయ్యి కోట్ల పెట్టుబడులను సంపాదించింది. లియో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ లియో వాంగ్‌ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర అధికారులు సమావేశమయ్యారు. పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా లియో కంపెనీ చైర్మన్‌ లియో వాంగ్‌ మాట్లాడుతూ రూ.1000 కోట్ల పెట్టుబడులను తెలంగాణలో పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. లియో గ్రూప్‌ కంపెనీ హెవీ డ్యూటీ పంప్‌లు, డిజిటల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పుతుంది.