తెలంగాణలో పెట్టుబడికి పలు కంపెనీల ఆసక్తి

C

బీజింగ్‌లో  అయా సంస్థల ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ చర్చలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి):

చైనా పర్యటనలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా ఉన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఆయన పలు చైనా కంపెనీలతో వరుస భేటీలు జరుపుతున్నారు. పలు చైనా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.  శనివారం ఆయన ఫార్చూన్‌ ల్యాండ్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంతకు ముందు ఆయన ఇన్సుపర్‌ గ్రూప్‌ బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం చైనా కంపెనీల ప్రతినిధులకు వివరించారు.  ఇన్‌స్పూర్‌ గ్రూప్‌ ప్రతినిధులతో సమావేశం  బీజింగ్‌లోని రాఫెల్‌ ¬టల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జహాంగ్‌ డాంగ్‌, ప్రతినిధులు స్నిగిక్‌ సూగ్‌, టెరెన్స డ్యూలతో కేసీఆర్‌ బద్కటీ అయ్యారు. ఎలక్టాన్రిక్స్‌, హార్డ్‌వేర్‌ రంగంలో ఈ కంపెనీ ఇప్పటికే మనదేశంలో పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాదే భారత్‌లో తన కార్యకపాలను ప్రారంభించింది. దీని కోసం గుర్గావ్‌లో కార్యాలయాన్ని నెలకొల్పింది. ఈ సంస్థ చినాలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలో అగ్రగామిగా ఉంది. సర్వర్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే ఐదో స్థానంలో కొనసాగుతోంది. సుమారు 50 దేశాలకు ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన కేసీఆర్‌ ఇటీవలే ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని వారికి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా కల్పించనున్న వసతులను గురించి వివరిస్తున్నారు. అలాగే సీఎఫ్‌ఎల్‌డీసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సీఎఫ్‌ఎల్‌డీసీ సంస్థ 1998లో బీజింగ్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టింది. కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధి, ఇండస్టీయ్రల్‌ జోన్లు, థీమ్‌ జోన్లు, పారిశ్రామిక వాడల ముఖ్య కేంద్రాల అభివృద్ధి, స్టాండర్డ్‌ వర్క్‌షాప్‌ల అభివృద్ధిలో పేరెన్నికగంది. సీఎఫ్‌ఎల్‌డీసీ సంస్థ అభివృద్ధి చేసిన వాటిలో గాన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, డచ్చాంగ్‌ చావోబాయ్‌ నదీ పరివాహక ప్రాంతం, జయ్‌షాన్‌ హెచ్‌ఎస్‌ఆర్‌ న్యూ సిటీ, షిన్‌ షూ ఎకో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సిటీ, చైనా ఫార్చున్‌ ఇన్నోవేషన్‌ పార్క్‌ తదితరాలు ఉన్నాయి. ఇలాంటి పార్కులనే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుపై సీఎఫ్‌ఎల్‌డీసీ సంస్థ దృష్టి సారిస్తోంది.