తెలంగాణవాదం బలహీనపర్చడానికే విజయమ్మ పర్యటన

వేములవాడ, జూలై 23 (జనంసాక్షి) : వైఎస్సార్‌సీపీ నాయకురాలు విజయమ్మ చేనేత దీక్ష పేరుతో చేపట్టిన సిరిసిల్ల పర్యటను ఈ ప్రాంతంలో తెలంగాణవాదాన్ని బలహీనపర్చడానికే తప్ప చేనేత కార్మికులపై ప్రేమతో కాదని టీిఆర్‌ఎస్‌ వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ విమర్శించారు. సోమవారం వైఎస్‌. విజయమ్మ చేనేత దీక్షను నిరసిస్తూ వేములవాడ-సిరిసిల్లా రహదారిలోని చంద్రం పేట వద్ద ఆయన రాస్తారోకో చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చేనేత కార్మికుల ఆత్మహత్యలు వైఎస్‌ ఆర్‌ హయాం లోనే ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. కాగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులు, తెలంగా ణవాదులు తెలంగాణ కోసం ఆత్మార్పణలు చేసుకున్నా ఒక్కనాడూ ఈ ప్రాంతానికి రాని వైఎస్‌ పార్టీ అధినేతలు జగన్‌ కానీ, ఆయన తల్లి విజయమ్మ కానీ పని గట్టుకుని ఇక్కడకు రావడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ ప్రాంతపు వైఎస్‌ఆర్‌ పార్టీ నాయ కులు విజయమ్మతో కేంద్రానికి తమ పార్టీ అనుకూలమేనన్న లేఖను ఇప్పించినట్లయితేనే తెలంగాణాకు ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు.

తాజావార్తలు