తెలంగాణ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : లగడపాటి

 

ఐతే మాటమీదుండు
న్యూఢిల్లీ, జూలై 2 (జనంసాక్షి) :
తన అభిప్రాయమే ప్రజలందరిదీ అని భ్రమించే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మంగళశారం మళ్లీ చిందులు వేశారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన సంకేతాలిస్తున్న ప్రస్తుత తరుణంలో లగడపాటి మాట మీద ఉంటే మంచిదని సీమాంధ్ర ప్రాంత నేతలే అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని ఎమ్మెల్యేలంతా రాష్ట్రం విడిపోయేందుకు సుముఖంగా ఉన్నారని అన్నారు. తెలంగాణపై అసెంబ్లీతో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముందని, ఆ తీర్మానం వీగిపోయేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పారు. తాము కేంద్రం అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరమే పార్లమెంట్‌లో తెలంగాణపై నిర్ణయం ఉంటుందంటూ దింపుడుకళ్లం ఆశ వ్యక్తం చేశారు.