తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు ఘన నివాళి
– ఊరు,వాడ ఒక్కటై తెలంగాణ అంతటా పెద్దసార్కు పుష్పాంజలి
హైదరాబాద్,ఆగస్ట్6(జనంసాక్షి):
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను తెరాస ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకలకు హాజరై ఆచార్య జయశంకర్ విగ్రహానికి సీఎం పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెరాస నేతలు… జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సచివాలయంలో జయశంకర్ చిత్రపటానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించారు. సచివాలయంలో జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా జయశంకర్ చిత్రపటానికి సీఎస్ రాజీవ్‌శర్మ నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు నివాళులర్పించారు. సీఎస్ రాజీవ్‌శర్మ విూడియాతో మాట్లాడుతూ జయశంకర్ జయంతి వేడుకలను జరపడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రావడానికి జయశంకర్ చేసిన కృషి మరువలేమని చెప్పారు. శాసనసభలో జరిగిన ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జయశంకర్ సేవలు మరువలేనివని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నేతలు ప్రతినబూనారు. తెలంగాణ అసెంబ్లీ హాలులో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్‌తో తమకు గల అనుబంధాన్ని, ఆయన సేవలను స్మరించుకున్నారు.
గన్‌పార్కు వద్ద ఐకాస ఆధ్వర్యంలో దీక్ష
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద ఐకాస ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు ఇంకా అసంపూర్తిగానే ఉందని ఈ సందర్భంగా టీ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీ, వవిధ సంస్థల కేటాయింపు తదితర అనేకానేక సమస్యలు ఇంకా ఉన్నాయని అన్నారు. ప్రధానంగా హైకోర్టు విభజన అన్నది అలాగే ఉండిపోయిందన్నారు. దీంతో సంపూర్ణ తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తోందన్నారు. హైకోర్టు విభజనపై ఏం చేస్తారో చేసుకోండని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. వెంకయ్య నాయుడు వైఖరి అభ్యంతరకరంగా ఉందని కోదండరామ్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఇంకా కొన్ని సంస్థలు ఏర్పడలేదన్నారు. అన్ని సంస్థలు సంపూర్ణంగా ఏర్పడితేనే పూర్తిస్థాయి పాలన కొనసాగదని ఆయన అన్నారు. ఇందుకు మరో ఉద్యమం చేయక తప్పదన్నారు. ఇందుకు తమవంతుగా ప్రయత్నం చేస్తామని,మరో ఉద్యమాన్ని చేపడతామని అన్నారు.
స్మారక కేంద్రం ఏర్పాటు ఏమైనట్లు?
ప్రొ.జయశంకర్ స్మారకకేంద్రం ఏర్పాటుపై చర్యలేవీ? అని ప్రభుత్వాన్ని మల్లేపల్లి లక్ష్మయ్య ప్రశ్నించారు. వెంటనే తెలంగాణలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మిషన్ ఎంఎ/-లాయిమెంట్ ప్రకటించాలనీ, ప్రతి ఏడాది 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా హావిూలు నెరవేర్చడంలో విఫలమయ్యిందని ఆరోపించారు.
ఢిల్లీలో జయశంకర్‌కు ఘనంగా నివాళి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అది అభివృద్ది చెందుఉతన్న తరుణంలో ప్రొఫెసర్ జయశంకర్ మరణించడం తీరని లోటని పలువురు టిఆర్ఎస్ ఎంపిలు అభిప్రాయపడ్డారు. సామాన్యుడిలో కూడా ఉద్యమ స్థెర్యాన్ని నింపిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అని తెలంగాణ ఎంపీలు, ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. జయశంకర్‌సార్ 81 జయంతిని పురస్కరించుకుని ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన నిరంతరం తెలంగాణ కోసం తపించి అమరుడయ్యాడని అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు గురువారం ఘనగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఉద్యోగ సంఘాల నేతలు, ఇతర ప్రముఖులు జయశంకర్ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జయశంకర్ ఆశయాలను అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్నారు. జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ సాధించు కున్నామన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ అడుగులు వేస్తోందని వినోద్ అన్నారు. ఆయన ఏదైతే తెలంగాణ కోరుకున్నారో అదే ఇప్పుడు సాకారమయ్యిందన్నారు. తెలంగాణ అంటేనే భయపడేరోజు నుంచి జయశంకర్‌సార్ ఉద్యమాన్ని నడిపించారు. ప్రొఫెసర్‌గానే కాదు..ఉద్యమనేతగా జయశంకర్ సార్‌కి మంచిపేరుంది. సామాన్యుడిలో కూడా ఉద్యమ స్థయిర్యాన్ని నింపారు. సార్‌కు నిజమైన నివాళిఅంటే ఆయన ఆశయాలను విజయవంతంగా కొనసాగించడమే. జయశంకర్‌సార్ తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షను బలంగా నడిపించి రాష్ట్రాన్ని సాధించారు. బంగారు తెలంగాణ సాధనకై సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరు. జయశంకర్ సార్ శిష్యుడిగా ఆకాంక్షను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నరని పేర్కొన్నారు. ఎంపీలు కేశవరావు,ఆనందభాస్కర్, కవిత,ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో జయశంకర్ సార్‌కు నివాళి
ప్రొఫెసర్ జయశంకర్‌సార్ లేని లోటు పూడ్చలేనిదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ప్రొ. జయశంకర్‌సార్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన సార్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. జయశంకర్ లేని లోటు పూడ్చలేనిదని, సార్ కలలుకన్న తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. భువనగిరి తెరాస పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దివంగత ఆచార్య జయశంకర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంగారు తెలంగాణ సాధించినప్పుడే జయశంకర్‌కు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని ఆ పార్టీ నాయకుడు డా.అమరేందర్ అన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థి చదువు నిమిత్తం డా.అమరేందర్ రూ.15వేలు విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని భువనగిరి ఆర్డీవో ఎన్.మధుసూదన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. భువనగిరి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన జయంతి వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయ సాధన కోసం ఉద్యోగులంతా కంకణబద్ధులై పనిచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో భువనగిరి తహసీల్దారు వెంకట్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు భగత్, సత్యనారాయణ, లియాక్ అలి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ చేసిన సేవలు మరువలేనివని ఎంపీపీ నాగేంద్రబాబు అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం కొండాపురం, చిలుకూరు గ్రామాల్లో జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. కార్యక్రమంలో కొండాపురం సర్పంచి ఎం.ఉపేందర్, గ్రామ కార్యదర్శి పరంకుశరావు, శ్రీనివాసరావు, డి.సురేష్, చిలుకూరు ఉపసర్పంచి నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి: మంత్రి ఈటెల
తెలంగాణా సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రసాధనే ఊపిరిగా ఎందరో ఉద్యమకారులలో స్పూర్తిని నింపిన పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. తెలంగాణా ఉద్యమ సిద్దాంతకర్త మ¬ద్యాయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఆకలి కేకలే లేని బంగారు తెలంగాణా నిర్మాణమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. తెలంగాణాలో మనిషిని మనిషి గౌరవించే తెలంగాణా రావాలని ఆయన కోరుకునేవాడని అలాంటి తెలంగాణా నిర్మాణంలో మనమందరం భాగస్వాములం అవుదామని మంత్రి పిలుపునిచ్చారు.ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా స్థానిక గంజ్ ఉన్నత పాఠశాలలో దూర ప్రాంతాలనుంచి వచ్చే పేద విద్యార్థులకు మంత్రి చేతులవిూదుగా ఉచిత బస్సు పాసులు పంపిణీ చేశారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని చక్కని క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి మంత్రి ఈటెల రాజేందర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ నీతూప్రసాద్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవిందర్ సింగ్, వైస్ చైర్పర్సన్ గుగ్గిళ్లపు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లాలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, బీర్కూర్ గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిష్టాపూర్‌లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, పాటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచి గంగొండ, ప్రధానోపాధ్యాయులు స్వరాజ్యలక్ష్మి, మోహన్, ఉపాధ్యాయులు గంగాధర్ మోహన్, నటరాజ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీపీ రాధ, జడ్పీటీసీ సభ్యురాలు సంగీతలు పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో జయశంకర్ జయంతిని పురస్కరించుకుని తహసీల్దార్ పండరినాథ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గంగాధర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.సదాశివనగర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్‌గా/నికి జయశంకర్ పితామహుడని జడ్పీటీసి సభ్యుడు రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ, ఎంపీడీవో చంద్రకాంతరావు, అధికారులు బాలకృష్ణ, వేణగోపాల్, భత్యార్ ఉద్దీన్, హరి సింగ్ పాల్గొన్నారు.