తెలంగాణ జిగేల్!
-రాష్ట్రానికి కేంద్రం అదనపు విద్యుత్ కేటాయింపు
-రాష్ట్రాన్ని హరితవనం చేద్దాం
-రిజర్వు ఫారెస్టు విరివిగా మొక్కలు పెంచాలి
-సీఎం కేసీఆర్
హైదరాబాద్,మార్చి 23 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర కరెంటు కష్టలు కొంత మేరకు తీరనున్నాయి. నూతన రాష్ట్రం ఎదుర్కోన్న ప్రధాన సమస్య విద్యుత్తే. ఎపి,తెలంగాణ రాష్టాల్రకు కేంద్రం అదనంగా విద్యుత్ ను కేటాయించింది. ఢిల్లీ ప్రభుత్వం సుమారు 693మెగావాట్ల విద్యుత్ ను వెనక్కి ఇచ్చి వేయగా దానిని మూడు రాష్టాల్రకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దాని ప్రకారం ఎపికి 304 మెగావాట్లు, తెలంగాణకు 222 మెగావాట్లు,కేరళకు 167 మెగావాట్లు కేటాయించారు. దీంతో తెలుగు రాష్టాల్ల్రో వేసవి కాలంలో విద్యుత్ సమస్య కొంత తగ్గవచ్చు. ఈ మేరకు ప్రజలకు ఊరట లభిస్తుంది. కేంద్ర నిర్ణయంతో ఇక ఈ ఎండకాలం తెలంగాణలో కరెంట్ కోతలు లేనట్టే. అదనపు విద్యుత్ కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో ఆయన కృషి ఫలించింది. తెలంగాణకు విద్యుత్ కేటాయించాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో సీఎం చర్చించిన విషయం విదితమే. ఎట్టకేలకు తెలంగాణకు అదనంగా 222 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం కేటాయించింది. ఝజ్జర్‌లోని ఆరావళి పవర్ కంపెనీ నుంచి రాష్టాన్రికి విద్యుత్ సరఫరా కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 222 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. అక్టోబర్ 1 నుంచి 2016, మార్చి 31 వరకు 374 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం రాష్టాన్రికి కేటాయించింది. దీంతో ఇక కోతలు లేకుండా సరఫషరా చేసే అవకాశాలు ఏర్పడ్డాయి.
హైదరాబాద్ మార్చి 23 (జనంసాక్షి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో అడవులను పెంచాలని సిఎం కెసిఆర్ కోరారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకే అటవీ భూముల కాని అందులో అడవిలేదని తెలిపారు. అటవీ భూములను సమర్థవంతంగా కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. తెలంగాణలో అటవీశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష జరిపారు. రిజర్వ్ ఫారెస్టుల్లో విరివిగా మొక్కలు పెంచాలని సీఎం సూచించారు. అటవీభూములను సమర్థవంతంగా కాపాడాలన్నారు. మొక్కలు పెంచేందుకు హరితహారం కింద నిధులు విడుదల చేస్తామని, మొక్కల పెంపకానికి అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. గజ్వేల్, ములుగులో 500 ఎకరాల్లో అటవీ కళాశాలలు ఏర్పాటుచేయనున్నట్లు సీఎం తెలిపారు. గ్రామాల్లో దోమల నియంత్రణకు ఔషధ మొక్కలు పెంచాలని కేసీఆర్ సూచించారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి సీఎస్ రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, అటవీశాఖ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, అటవీశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…అడవుల పెంపకానికి అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్టు అన్ని భూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని తెలిపారు. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలని అన్నారు. హరితహారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో 5 వందల ఎకరాల విస్తీర్ణంలో కోయంబత్తూరు తరహాలో ఫారెస్టు కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 34 వేల ఎకరాల అటవీ భూమి ఉందని తెలిపారు. అటవీ భూముల చుట్టూ కందకం తవ్వి కంచె వేయాలని సూచించారు. వచ్చే మూడేళ్లలో పచ్చదనం ఆచరణలో కనిపించాలని కోరారు. పండ్లు, పూల చెట్లతో ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. గ్రామాల్లో దోమలు రాకుండా కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడుతాయన్నారు. నగరంలోని గుర్రంగూడెం, దూలపల్లి, ఎస్‌ఆర్ నాయక్ నగర్, కొండ్లకోయ, హరిణ వనస్థలి ప్రాంతాల్లోని ఫారెస్టు బ్లాకులను రక్షించాలని అన్నారు. బ్లాకుల చుట్టూ కేబీఆర్ పార్కు మాదిరిగా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.