తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: ఈటల

జగిత్యాల,జూలై 2(జ‌నం సాక్షి ): సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనిరాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతదన్న వారికి అమలువుతున్న పథకాలే సమాధానమన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలో మంత్రి పర్యటించారు. పర్యటనలో భాగంగా మాతా శిశుసంక్షేమ కేంద్ర నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి ఈటల రాజేందర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ కవిత, జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్‌ శరత్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, మైనార్టీ ్గ/నాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బరుద్దీన్‌, మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పొట్రూ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కె. చంద్రశేఖర్‌రావు, జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ టి. విజయలక్ష్మితో పాటు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పాఠశాలలకు గ్యాస్‌ సిలిండర్లను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ కవిత పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కోసం 653 గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ఓల్డ్‌ హైస్కూల్‌లో జరిగింది. ఈ సందర్బంగా అనేక కార్యక్రమానలు ప్రవేశ పటెట్‌ఇన ఘనత సిఎం కెసిఆర్‌దని ఈటెల అన్నారు. రైతులకు పెట్టుబడి పథకం, బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.