తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
గప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజి జయంతి నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. డనిపబజూ;రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ భాషాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. సెప్టెంబర్ 9న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ భాషపై చర్చా గోష్టులు.. వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణలో భాష, సాహిత్య రంగంలో విశేష కృషి చేసినవారికి కాళోజీ స్మారక పురస్కారం అందించనున్నట్టు సీఎం తెలిపారు.
తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో రాజు వేగేశ్న ఫౌండేషన్ సభ్యులు సీఎం కేసీఆర్ ని కలిసి ఈ మేరకు తమ అంగీకారపత్రాన్ని అందజేశారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగస్వాములవుతామని ఫౌండేషన్ చైర్మన్ అనంతకోటి, ట్రస్టీలు ఆనందరాజు, రాజేష్, తిరుమలరాజు చెప్పారు. ఇందుకోసం ఫౌండేషన్ తరఫున రూ. 5 కోట్ల విరాళాన్ని సీఎం కేసీఆర్ కు అందజేశారు.
యాదగిరిగుట్టలో అన్నప్రసాదం కాంప్లెక్స్, వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని సీఎం కేసీఆర్ కు ఫౌండేషన్ తరఫున హావిూపత్రం అందజేశారు. యాదగిరిగుట్టతోపాటు ధర్మపురి, భద్రాచలం, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కాళేశ్వరం దేవాలయాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహేశ్వర పిరమిడ్, వరంగల్ భద్రకాళి, జమలాపురం, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ దేవాలయాల్లోనూ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
హైదరాబాద్ లో ఎండోమెంట్ భవన్, ఉస్మానియా యూనివర్సిటీ, సాలార్ జంగ్ మ్యూజియం, చంచల్ గూడ జైలు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లు, పోలీస్ మెస్, సీఐడీ ఆఫీస్, పోలీస్ బెటాలియన్లలో కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ సభ్యులు హావిూ ఇచ్చారు.
వరంగల్ జిల్లాలోని కేశిరెడ్డిపల్లి, బైరాన్ పల్లి, ఆకునూరు, నారాయణపురం, కడవేరుగు, కూటిగల్, గోపాలనగర్, కరీంగనర్ జిల్లా కాళేశ్వరం, ఇటిక్యాలపల్లి తదితర గ్రామాల్లో కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ సభ్యులు చెప్పారు.
ఇప్పటికే రూ. 21 కోట్ల వ్యయంతో తిరుమలలో అన్నదాన సత్రం, రూ. 5 కోట్ల వ్యయంతో టీటీడీలో జలప్రసాదం, రూ. 15 కోట్లతో ద్వారకా తిరుమలలో హాస్పిటల్ ను ఏర్పాటు చేసినట్టు ఫౌండేషన్ సభ్యులు చెప్పారు.
తెలంగాణ దేవాలయాల అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చిన రాజు వేగేశ్న ఫౌండేషన్ నిర్వాహకులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ ఎంపీ బి. వినోద్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.