తెలంగాణ మంత్రులకు చీరలు, గాజులతో నిరసన

 

జగిత్యాల మండలం పాత బస్టాండులో తెరాస అధ్వర్యంలో తెలంగాణ వాదులు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాజులు, చీరలు, మల్లెపూల దండలను ప్రదర్శించి వీటిని తెలంగాణ మంత్రులకు పంచనున్నామని తెలిపారు. తెలంగాణ విషమంలో మంత్రుల చేతగానితనాన్ని తెలియజేప్పడానికి ఇలా నిరసన తెలుపుతున్నామని వారు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పడాల శ్రీనివాస్‌, పరశురామ్‌ గౌడ్‌, దేవేంద్రనాయక్‌ పాలెపు రాజు తదితరులు పాల్గోన్నారు.