‘తెలంగాణ మార్చ్’కు సిద్దమవుతున్న నాయకుల ముందస్తు అరెస్ట్‌లు
కరీంనగర్: ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజలు సిద్దమవుతున్న దశలో తెలంగాణ నాయకులను ముందస్తు అరెస్ట్‌ల పర్వం మొదలయింది. ఈ రోజు టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు గద్దర్ రవీందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు టీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు. ఈ ముందస్తు అరెస్ట్‌లపై తెలంగాణ వాదులందరు ఖండిస్తున్నారు. ఏది ఎమైన తెలంగాణ మార్చ్ విజయవంతం చేసి తీరుతామని తెలంగాణ వాదులంత ముక్త కంఠంతో నినాదిస్తున్నారు.