తెలంగాణ లో ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కూలి పోకుండా అడ్డుకున్నదే

సెప్టెంబరు 17 దినం!

–అందుకే సెప్టెంబర్ 17 ను విద్రోహ దినంగా పాటించండి!!
–సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ పిలుపు

టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణలో ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కూలిపోకుండా అడ్డుకున్నదే సెప్టెంబర్ 17 దినం అని అందుకే సెప్టెంబర్ 17న విగ్రహ దినముగా పాటించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తుందని రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. క్రూర నిజాం రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మృగ్యమై వెట్టి చాకిరీ అమలైనప్పుడు,దాన్ని తుద ముట్టించడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 జూలై 4 న దొడ్డి కొమురయ్య హత్య తో ప్రారంభమైందని,
నిజాం ఆగడాలకు వ్యతిరేకంగా ప్రధానంగా తెలుగు భాషా వికాసం కోసం ,తెలుగు మాధ్యమం కోసం ఆంధ్ర మహాసభ ఏర్పడింది. దీనికోసం మాడపాటి హనుమంతరావు లాంటి పెద్దలు 20వ శతాబ్దం ప్రారంభం నుండే గొప్ప ఉద్యమాలు సాగించారు. ఆంధ్ర మహాసభ క్రమంగా కమ్యూనిస్ట్ పార్టీ గా రూపాంతరం చెంది దున్నే వాడికే భూమి నినాదం తో ఉద్యమించడమే గాకుండా నిజాం రాచరిక నియంతృత్వ సర్కార్ ను కూల్చివేసే దశకు చేరింది.ఇంతలోనే 1948 సెప్టెంబరు 17న యూనియన్ సైన్యాలు తెలంగాణలో ప్రవేశించాయి.అప్పటికే నిజాం తన శక్తిని పూర్తిగా కోల్పోయాడు.నిజాంనే కాదు, ఆయన సృష్టించిన రజాకార్లను కూడా కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రజలు మట్టి కరిపించారు. అప్పటికే నిజాం అనుకూల జమిందారులనుండి, భూస్వాముల నుండి, దేశ్ముఖ్ ల నుండి సుమారు 10 లక్షల ఎకరాలను భూములను ప్రజలు సాధించుకుని, పంచుకొన్నారు. 3 వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను సాధించుకొన్నారు. ఇది దేశంలో, ప్రపంచంలో గొప్ప భూపోరాటంగా మారింది.
దీన్ని ప్రమాదకరంగా విదేశీ పెట్టుబడిదారులు, దేశంలోని దళారీ వర్గాలు తీవ్రంగా భావించాయి. దీన�