తెలంగాణ సాధన శిబిరాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని దుండగలు
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 16 జనంసాక్షి:
తెలంగాణ చౌక్‌లోని తెలంగాణ సాధన శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి తగలబెట్టారు. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా కరీంనగర్ కవాతు సమావేశం ముగిసిన కొద్ది సేపటికే ఈ సంఘటన జరగడం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అధికార పార్టీని జిల్లా మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని అక్కడ గుమిగూడిన తెలంగాణ వాదులు అనుమానిస్తున్నారు. శిబిరం తగలబెట్టిన విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపుచేసింది. ఈ సంఘటనకు నిరసనగా తెలంగాణ వాదులు రాస్తారోకో చేశారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా టుటౌన్ పోలీసులు నిఘ ఏర్పాటు చేశారు.