తొలి టెస్టులో నిలకగడగా సౌతాఫ్రికా బ్యాటింగ్
జోహెనస్‌బర్గ్,ఫిబ్రవరి1: పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ఆసక్తి కరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓ పెనర్లు స్మిత్ 24 , పీట ర్సన్ 20 పరుగులకు ఔట య్యారు. తర్వాత హషీ మ్ ఆమ్లా , కల్లిస్ సఫారీ ఇన్నింగ్స్ కొనసాగిం చారు. నిలకడగా ఆడు తూ మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. ఈ దశలో హాఫ్ సెంచరీ చేసిన కల్లిస్‌ను ఉమర్‌గుల్ ఔట్ చేశాడు. వెంటనే యూనిస్‌ఖాన్ బౌలింగ్‌లో ఆమ్లా కూడా పెవిలియన్ చేరుకోవడంతో దక్షిణాఫ్రికా మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 55 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులతో ఆడుతోంది.డివిలీయర్స్ , డుప్లెసిస్ క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. వంద టెస్టులకు సారథ్యం వహించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకూ 99 టెస్టుల్లో సౌతాఫ్రికాకు కెప్టెన్సీ చేసిన స్మిత్ , ఒక మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ టీమ్‌కు నాయకత్వం వహించాడు. దీంతో కెప్టెన్‌గా స్మిత్ కెరీర్‌లో వంద టెస్టుల మైలురాయి పూర్తైంది. కేప్‌టౌన్‌లో జరిగే రెండో టెస్టుతో స్మిత్ సఫారీ సారథిగా వంద టెస్టులు పూర్తి చేసుకోనున్నాడు.