త్వరలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి,కేటీఆర్ చేతుల మీదుగా అనాధ పిల్లల ఆశ్రమం ప్రారంభం

కోటగిరి మే 31 జనం సాక్షి:-కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో గుమ్మడి పౌండేషన్ వారి ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఏడు కోట్ల వ్యయంతో తల్లిదండ్రులు లేని పిల్లల కొరకు అనాధ పిల్లల ఆశ్రమాని ఏర్పాటు చేశారని కోటగిరి మండల జడ్పీటీసీ శంకర్ పటేల్ పేర్కొన్నారు.మంగళ వారం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. ఏడు కోట్ల వ్యయంతో నిర్మించిన అనాధ పిల్లల ఆశ్రమాన్ని త్వరలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోడం జరుగుతుందని.అలాగే ఈ అనాధ పిల్లల ఆశ్రమంలో ప్రభుత్వ చైల్డ్ వెల్ ఫేర్ సర్టిఫయిడ్ పిల్లలను మాత్రమే చేర్చుకోని వారి,విద్యా,వైద్యం,భోజన వసతులను పౌండషన్ వ్యవస్థాపకులైన,గుమ్మడి సుచిత్ర,శ్రీధర్ భాద్యత వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.చైల్డ్ వెల్ఫెర్ అధికారులు సర్టిఫయిడ్ చేసిన అనాధ పిల్లలను మాత్రమే మొదటగా పది మందిని చేర్చుకొని త్వరలో ప్రారంభించుకోవడం అభినందించదగ్గ విషయం అని పేర్కొన్నారు.ఇట్టి ఆశ్రమ ఏర్పాటుకు పౌండేషన్ వ్యవస్థాపకులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు రంగబాబు అందించడం గొప్పవిషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏజాజ్ ఖాన్, రంగబాబు,రఫి, గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.