దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బందు

అసమానతలను రూపుమాపుతున్న బృహత్తర పథకం దళిత బందు

దళిత బందు దేశ చరిత్రలోనే సాహసోపెత పథకం.

మహనీయుల కలలను సాకరం చేస్తున్న దళిత బంధావుడు సీఎం కేసీఆర్

దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకువాలి

ఆర్థికంగా పరిపుష్టి సాధించి… దర్జాగా బతకాలి

సీఎం కేసీఆర్ గారి కలను సాకారం చేయాలి
అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం
మానవపాడు( జనం సాక్షి )28 ఆగస్టు: మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన శ్రీ.మద్దిలేటి గారి దళిత బందు లో బాగంగా కిరణం షాప్ ను ప్రారంభించిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్.వి.యం.అజయ్

ఈ సదర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.
దశబ్దాల కాలంగా సమాజంలో ఆర్థికంగా, సామజికంగా వెనకబడిన దళిత కుటుంబాలలో ఆర్ధిక స్వావలంబన తీసుకురావాలనే గొప్ప సంకల్పంతో దళిత బంధావుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళిత బందు పథకానికి శ్రీకారం చుట్టారని దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రత్యేక దృష్టితో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ దళిత బందు పథకం దళితుల ఆర్థిక అసమానతలను, అంతరాలను రూపుమాపి దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలుకనున్నదని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంటి మహనీయులు కన్న కలలు దళిత బంధుతో సాకారమవుతున్నాయని తెలిపారు. దళితుల అభ్యున్నతిపై ఉద్యమ కాలం నుంచే సీఎం కేసీఆర్‌ బృహత్తర ప్రణాళికతో ఉన్నారని, నేడు అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే దళిత బందు సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దళితబంధు పథకం ఓ విప్లవాత్మక నిర్ణయమని, నిన్నటివరకు డ్రైవర్లుగా పనిచేసినోళ్లు ఇవ్వాళ ఓ ట్రాక్టర్‌కు, కారుకు, పరిశ్రమలకు ఓనర్లు అయినందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ముఖ్యంగా ఒక దళిత బిడ్డగా నాకెంతో గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ గారి లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో మానవ పాడు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జాల్లపురం వెంకటేశ్వర్లు ,జోగులాంబ ఆలయ ధర్మకర్త అనంత రెడ్డీ ,కాంత రెడ్డీ ,మహమ్మదు గారు,pacs వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి సంపత్ కుమార్ రెడ్డి వెంకట్ రామ్ రెడ్డీ ,కృష్ణ రెడ్డీ ,ప్రభాకర్ ప్రసాద్ , శంతాన్న ,మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు